వండర్స్‌‌ క్రియేట్‌‌ చేయాలంటే.. ఇలా కూడా చేయొచ్చు

వండర్స్‌‌ క్రియేట్‌‌ చేయాలంటే.. ఇలా కూడా చేయొచ్చు


ఈ ఫొటోల్లోని బిల్డింగ్స్​ని చూస్తే ఎవరో శిల్పి గొప్పగా చెక్కిన శిల్పాల లెక్క అనిపిస్తుంది. కానీ అవి శిల్పాలు కావు. కేక్స్‌‌! వండర్స్‌‌ క్రియేట్‌‌ చేయాలంటే సాహసాలే చేయాల్సిన అవసరం లేదు. టాలెంట్‌‌ను నమ్ముకుంటే చాలు. తనకున్న టాలెంట్‌‌తో ఎడిబుల్‌‌ రాయల్‌‌ ఐసింగ్‌‌ కేక్‌‌ను తయారుచేసి ‘వరల్డ్‌‌ బుక్‌‌ ఆఫ్‌‌ రికార్స్’లోకి ఎక్కింది ఈ కేక్ మేకర్‌‌‌‌.

పుణెలోని ప్రాచీ ధబాల్‌‌ దేవ్‌‌, ప్రపంచ ప్రఖ్యాత కేక్‌‌ మేకింగ్‌‌ ఆర్టిస్ట్‌‌. రాయల్‌‌ ఐసింగ్ ఆర్ట్‌‌లో ఎన్నో అవార్డ్స్‌‌ గెలుచుకుంది. యునైటెడ్‌‌ కింగ్‌‌డమ్‌‌లో ప్రపంచ ప్రఖ్యాత కేక్‌‌ ఐకాన్‌‌ సర్‌‌‌‌ ఎడ్డీ స్పెన్స్‌‌ ఎంబిఇ దగ్గర కేక్‌‌ ఆర్ట్‌‌ నేర్చుకుంది ప్రాచీ. 
ఈ మధ్యనే ఇటలీలో ఉండే ‘మిలాన్‌‌ కేథడ్రల్‌‌’ షేప్‌‌లో వంద కేజీల ఎడిబుల్‌‌ రాయల్‌‌ ఐసింగ్‌‌ ఎగ్‌‌ లెస్‌‌ కేక్‌‌ తయారుచేసింది. ఈ కేక్‌‌ తయారు చేసినందుకు ‘వరల్డ్‌‌ బుక్‌‌ ఆఫ్‌‌ రికార్డ్స్‌‌, లండన్‌‌’లోకి ఎక్కింది ప్రాచీ. 
మిలాన్ కేథడ్రల్‌‌ కేక్‌‌ను పర్ఫెక్ట్‌‌గా డిజైన్‌‌ చేయడానికి నెలరోజుల టైం పట్టిందట. మొత్తం 1,500 భాగాలు ఉండే ఈ కేక్‌‌ను ఎవరి హెల్ప్‌‌ తీసుకోకుండా తయారుచేసిందట ప్రాచీ. ఈ కేక్‌‌ మొత్తం 6.4 అడుగుల పొడవు, 4.6 అడుగుల ఎత్తు, 3.10 వెడల్పు ఉంటుందట. ఇండియా కంపెనీ ‘షుగారిన్‌‌’తో కలిసి రడీ టు యూజ్ ఎగ్‌‌లెస్‌‌ వెగాన్‌‌ రాయల్‌‌ ఐసింగ్ తయారుచేస్తోంది. ఇవి ప్రపంచంలో చాలాచోట్ల అందుబాటులో ఉన్నాయట. ఇవి తయారుచేయడం అంత ఈజీ ఏం కాదు. స్కిల్‌‌తో పాటు ఓపిక కూడా ఉండాలి. ఎందుకంటే ఏ చిన్న తప్పు జరిగినా అప్పటి వరకు పడ్డ కష్టం వేస్ట్‌‌ అవుతుంది. అందుకే ప్రాచీని ‘క్వీన్‌‌ ఆఫ్‌‌ రాయల్‌‌ ఐసింగ్‌‌’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే చూడ్డానికి లగ్జరీ, రాయల్‌‌ లుక్‌‌ ఉండటమే కాదు టేస్ట్‌‌లోనూ ఏ మాత్రం తీసిపోవు ఆమె చేసిన కేక్స్‌‌. ప్రాచీ 2014 నుంచే రకరకాల కేక్స్‌‌ తయారు చేయడం మొదలుపెట్టింది. 
తను మొట్టమొదట ట్రై చేసింది నాలుగు ఇంచుల ‘గెజిబో’ షేప్‌‌లో ఉండే ఎడిబుల్‌‌ రాయల్‌‌ ఐసింగ్‌‌ కేక్‌‌. తరువాత తన స్కిల్‌‌ డెవలప్‌‌ చేసుకుంటూ 2020 లో 3.9 అడుగుల ఎత్తు ఉన్న కేక్‌‌ చేసింది. ఇప్పుడు 6.4 ఫీట్స్‌‌ కేక్‌‌ చేసింది. వరల్డ్‌‌ బుక్‌‌ ఆఫ్‌‌ రికార్డ్‌‌ అవార్డ్‌‌తో పాటు 2020లో మోడర్న్‌‌ ఇండియా  గేమ్‌‌ ఛేంజర్‌‌గా ఫోర్బ్స్‌‌లోకి, 2021లో ఫెమీనా అవార్డ్‌‌, టైమ్స్‌‌ విమెన్‌‌ ఆఫ్‌‌ సబ్‌‌స్టాన్స్‌‌లో ఒకరిగా గుర్తింపు పొందింది. 2021లోనే మహారాష్ట్ర గవర్నర్‌‌‌‌ చేతుల మీదుగా భారత్‌‌ లీడర్‌‌‌‌షిప్‌‌ అవార్డ్‌‌ తీసుకుంది.  ‘ఎన్నో ఏండ్లుగా నేను పడిన కష్టానికి వచ్చిన ఫలితం నా సక్సెస్‌‌. నాకొచ్చిన ఈ సక్సెస్‌‌ గురించి మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది’ అంటోంది 35 ఏండ్ల ప్రాచీ ధబాల్‌‌ దేవ్‌‌.