సీఏఏకు మద్దతిచ్చే ప్రభుత్వం కావాలె

సీఏఏకు మద్దతిచ్చే ప్రభుత్వం కావాలె

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: మనపై దాడిచేసే అవకాశాన్ని శత్రువులకు ఇచ్చే ప్రభుత్వం ఢిల్లీకి అక్కర్లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా ఆప్​ సర్కారుపై మండిపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలకు, ఆర్టికల్​ 370 రద్దుకు, సీఏఏకు మద్ధతుగా నిలిచే ప్రభుత్వమే ఢిల్లీలో ఏర్పడాలని అన్నారు. ఈమేరకు మంగళవారం ఢిల్లీలోని ద్వారకలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రజాసమస్యలను, అభివృద్ధిని పక్కనపెట్టి బ్లేమ్​గేమ్​తో కాలంగడిపే ప్రభుత్వం అక్కర్లేదన్నారు. ఢిల్లీలో ఆయుష్మాన్​భారత్​ను అమలుచేయకపోవడాన్నీ ప్రధాని ప్రస్తావించారు.

‘‘ఆయుష్మాన్​ భారత్​కు ‘మొహల్లా  క్లినిక్స్’ ఆల్టర్నేటివ్​ అని ఆప్​ చెబుతోంది.. మీరు ఢిల్లీ దాటి వెళ్లినపుడు సుస్తీ అయితే అక్కడ ఈ క్లినిక్స్​ ఉపయోగపడతాయా”అని ప్రశ్నించారు. ‘మీకళ్ల ముందే దేశం మారిపోతోంది.. ఢిల్లీలోనూ మార్పు తీసుకురావాల్సిన టైమొచ్చింది. బాట్లా హౌస్​ టెర్రరిస్టుల కోసం ఆప్, కాంగ్రెస్​ పార్టీలు ఏడవడమూ మీకు తెలుసు.. దేశ సైనిక బలగాలను అవమానించిన వాళ్లకు బుద్ధి చెప్పేలా ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయండి’ అంటూ ప్రధాని మోడీ ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం..