చేనేతపై జీఎస్టీ ఎత్తేసే వరకు ఉద్యమిస్తాం

చేనేతపై జీఎస్టీ ఎత్తేసే వరకు ఉద్యమిస్తాం
  • ఎమ్మెల్సీ ఎల్‌‌.రమణ

హైదరాబాద్‌‌, వెలుగు: హ్యాండ్లూమ్‌‌, టెక్స్‌‌టైల్‌‌ పరిశ్రమపై జీఎస్టీ పూర్తిగా ఎత్తేసే వరకు ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ ఎల్‌‌.రమణ అన్నారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతం పెంచే ప్రతిపాదనను శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్‌‌లో వాయిదా వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్‌‌, హరీశ్‌‌రావు కేంద్రానికి లేఖ రాసి చేనేత పరిశ్రమకు అండగా నిలిచారని తెలిపారు. కేంద్రం తీరు మార్చుకోకుంటే రానున్న రోజుల్లో చేనేత దస్తులు మ్యూజియంలో చూసే ప్రమాదం ఉందన్నారు.

జీఎస్టీ పెంపును రద్దు చేయాలె

చేనేత పరిశ్రమపై జీఎస్టీ పెంచాలన్న నిర్ణయాన్ని పూర్తిగా రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌‌ చేశారు. జీఎస్టీ పెంచితే వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ వారు రోడ్డున పడతారన్నారు.