ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు ఇస్తాం

ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు ఇస్తాం

దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు ఇస్తామని తెలిపారు సీఎం కేసీఆర్.చివరి వరుసలో దళిత ఉద్యోగులు దళిత బంధు తీసుకోవాలని చెప్పారు. ఇవాళ  హుజురాబాద్ లోని శాలపల్లి,ఇందిరానగర్ లో నిర్వహించిన దళిత బంధు సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్..రైతు బంధు తరహాలోనే దళిత బంధు ఇస్తామన్నారు. ఈ స్కీం కొత్త చరిత్రను సృష్టించే పథకమన్నారు. మహా ఉద్యమంలా కొనసాగాలన్నారు. దళిత బంధుతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఈ  స్కీం దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా మారుందని.. సక్సెస్ చేసి చుపిస్తామన్నారు.

దళితులకు  రూ.10 లక్షలు ఇవ్వాలన్న ఆలోచన ఏ పార్టీ చేయలేదన్నారు సీఎం కేసీఆర్. కరోనాతో ఏడాది ఆలస్యంగా ఈ స్కీంను మొదలు పెట్టామన్నారు. దళిత బంధు అనగానే.. కిరికిరి గాల్లు మొదలయ్యారన్నారు. ఇచ్చేటోడు ఇస్తడు..తీసుకునేటోడు తీసుకుంటరు..మధ్యలో మీదేంది అని ప్రశ్నించారు. సమగ్ర సర్వే  ప్రకారం హుజురాబాద్ లో 21 వేల దళత కుటుంబాలున్నాయని.. హుజురాబాద్ లో ప్రతీ కుటుంబానికి పది లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు.