
రాష్ట్రంలో టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు త్వరలోనే ఒరిజనల్ మెమోలు అందజేయనున్నట్లు SSC అధికారులు తెలిపారు. టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు ఇఫ్పటికే షార్ట్ మెమోలు అందజేశారు. విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లను అంద చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని బోర్డు అధికారులు తెలిపారు. మెమోలు పంపిణీ చేయడానికి ముందు మెమోల్లో విద్యార్ధులకు సంబంధించిన పేరు, పుట్టిన తేది, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయా లేవో పరీక్షించుకోవడానికి విద్యార్ధులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.