రీజినల్ రింగ్ రోడ్డు సర్వే నిర్వహిస్తే అడ్డుకుంటాం

రీజినల్ రింగ్ రోడ్డు సర్వే నిర్వహిస్తే అడ్డుకుంటాం

రీజినల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ వెంటనే మార్చాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చాలని కోరుతూ నిరసన తెలిపారు. ఈ నిరసనలో బాధితులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ... రీజినల్ రింగ్ రోడ్డు సర్వే నిర్వహిస్తే అడ్డుకుంటామన్నారు. హద్దురాళ్లు నాటితే తొలగించాలన్నారు. కేసీఆర్ ఒక్కడు బాగుంటే అది బంగారు తెలంగాణ కాదన్న ఆయన... పేదల ఆస్తులు కాపాడినప్పుడే బంగారు తెలంగాణా అవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ భూముల నుంచే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించేలా చూడాలని కోరారు. రెండు మూడు కోట్లకు ఎకరం భూమి విలువ ఉందని, ఆ విధంగానే బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.