హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏకు పూర్వవైభవం తెస్తాం: సెక్రటరీ జీవన్ రెడ్డి

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏకు పూర్వవైభవం తెస్తాం: సెక్రటరీ జీవన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ)లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతామని సెక్రటరీ జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, టోర్నీలు నిర్వహించి అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ అనుబంధ క్లబ్ సెక్రటరీలతో సమావేశమైన జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి వాళ్ల సమస్యల పరిష్కారానికి తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. 

ప్లేయర్ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో విశ్వసనీయత కోసం క్రికెటర్ల బర్త్ సర్టిఫికెట్లను డిజిటలైజ్ చేసి, వాటిని ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింక్ చేయాలని సూచించారు. ఇక హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ కార్యకలాపాల్లో పారదర్శకతను పెంచడానికి బీసీసీఐ తో అనుబంధం ఉ న్న  ప్రముఖ టెక్నాలజీ సంస్థ స్పోర్ట్స్ మెకానిక్స్ సేవలను ఉపయోగించుకోనున్నట్లు ప్రకటించారు. క్లబ్ ప్రతినిధుల విన్నపం మేరకు నాలుగు రోజుల లీగ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మూడు రోజులకు తగ్గించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు.