సుధాకర్ రెడ్డి జీవిత చరిత్రను పుస్తకంగా తెస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

సుధాకర్ రెడ్డి జీవిత చరిత్రను పుస్తకంగా తెస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు: సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి జీవితం ఆదర్శప్రాయమని, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతో కృషి చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు.  నాగర్​కర్నూల్​జిల్లా కొల్లాపూర్ లో బుధవారం వద్ది నర్సిరెడ్డి అధ్యక్షతన సుధాకర్ రెడ్డి సంస్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజ సమానత్వం కోసం తుదివరకు నిలబడ్డ వ్యక్తి సురవరం అని, అలాంటి నేతను కన్న తల్లిదండ్రులు ఆదర్శనీయులని పేర్కొన్నారు.

సురవరం సుధాకర్ రెడ్డి జీవిత చరిత్రను పుస్తకంగా తెచ్చి  పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. సుధాకర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, నేతలు బాల నరసింహ, ఎల్లేని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.