ట్విటర్​లో బ్లూటిక్​లకు ఇక నుంచి చార్జ్​ చేస్తాం : ఎలన్​ మస్క్​

ట్విటర్​లో బ్లూటిక్​లకు ఇక నుంచి చార్జ్​ చేస్తాం : ఎలన్​ మస్క్​

న్యూఢిల్లీ: ట్విటర్​లో బ్లూటిక్​లకు ఇక నుంచి చార్జ్​ చేస్తామని సంస్థ బాస్​ ఎలన్​ మస్క్​ చేసిన ట్వీట్​కు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​సీపీఐ) స్పందించింది.  నెలవారీ చెల్లింపుల కోసం డెవలప్​ చేసిన తమ యూపీఐ ఆటోపే ఆఫర్‌‌‌‌ను  వాడుకోవాలని  సూచించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  దిలీప్ అస్బే ..మస్క్ చేసిన ట్వీట్‌‌కు సమాధానమిస్తూ, యూపీఐ  రికరింగ్​ పేమెంట్స్​ ఆఫర్‌‌కు ఇప్పటికే 70 లక్షల మంది కస్టమర్లు ఉన్నారని చెప్పారు.

 ‘‘బాధపడొద్దు!  ప్రతిసారీ/నెల/క్వార్టర్​ లేదా వార్షికంగా డబ్బులు వసూలు చేయడానికి యూపీఐ ఆటోపే ఉంది" అని  అస్బే సరదాగా ట్వీట్​చేశారు.  ట్విటర్ చాలా సంవత్సరాలుగా పబ్లిక్ ఫిగర్స్​కు ఫ్రీగా 'బ్లూ టిక్' ఇస్తోంది. ఇప్పుడు చార్జ్​ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.