పంజాబ్​లో వేర్వేరుగానే పోటీ: కేజ్రీవాల్

పంజాబ్​లో వేర్వేరుగానే పోటీ: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్​లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ విడివిడిగానే పోటీ చేస్తాయని ఆప్ చీఫ్​ కన్వీనర్ అర్వింద్​ కేజ్రీవాల్​వెల్లడించారు. ఈమేరకు రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరిందని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. కాంగ్రెస్  నేత, ప్రముఖ అడ్వొకేట్ అభిషేక్  సింఘ్వీని కేజ్రీవాల్  ఆదివారం  ఆయన నివాసంలో కలిశారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ ప్రత్యర్థులుగా ఉన్నా ప్రతిపక్షాల ఇండియా కూటమిలో మిత్రపక్షంగానే ఉన్నామని పేర్కొన్నారు. అలాగే, ఢిల్లీలో సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్  కలిసి పోటీచేయకపోతే బీజేపీ లబ్ధి పొందుతుందని కేజ్రీవాల్​ చెప్పారు.