
తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్
ఓయూ, వెలుగు : కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం సమగ్ర కులగణన చేయాలని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద మీడియాతో మాట్లాడారు.. ఏ ప్రభుత్వం వచ్చినా.. ఉద్ధేశపూర్వకంగానె బీసీలను అన్ని రంగాల్లో వెనుకటుకు గురిచేస్తున్నాయిని, దీనికి తోడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీలే తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా రిజర్వేషన్లతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయకపోతే ఆర్ట్స్ కాలేజ్ వేదిక ఆమరణ దీక్షలకు దిగుతామని , మరో తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్రిక్త పరిస్థితులను ఏదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఎస్పీ నాయకులు నూకల మధు యాదవ్, బీసీ సంఘం నేత పవన్ వర్మ, తెరిసా, మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.