టెర్రరిజంపై పోరులో మేం ఇండియా వెంటే.. అమెరికా స్పీకర్ మైక్ జాన్సన్

టెర్రరిజంపై పోరులో మేం ఇండియా వెంటే.. అమెరికా స్పీకర్ మైక్ జాన్సన్

న్యూఢిల్లీ: టెర్రరిజానికి వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న పోరాటానికి అమెరికా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. పహల్గాం టెర్రర్ అటాక్​తో ఇండియా, పాక్​ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జాన్సన్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియా టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడా లి. 

మద్దతు ఇవ్వడానికి మేం సాధ్యమై నంత సహాయం చేస్తాం. భారత్​కు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అవసరమైన సాయం అందిస్తుంది. ఇండియాతో సంబంధాలు మాకు  చాలా కీలకం. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న పోరాటానికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తాం” అని మైక్ జాన్సన్ పేర్కొన్నారు.