రైతు రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ పడావు పెట్టిందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డిని చేపట్టింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. పాలమూరు ప్జాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా అడిగితే కేంద్రం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. కేంద్రం నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా వేనకబడిందని రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ గెలవాలిన అన్నారు.
రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్, ఐటీఐఆర్ కారిడార్ అడిగితే బీజేపీ ఇవ్వలేదు. రాష్ట్రాన్ని ఇన్ని అడిగితే.. బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శించారు.
శ్రీరామనవమి, హనుమాన్ జయంతిని చూపించి బీజేపీ ఓట్లు అడుగుతోందని. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లోల ఉండాలని అన్నారు. రైతు భరోసా కింద ఖాతాల్లో రూ. 7 వేల 500 కోట్లు వేశామని తెలిపారు. సవాల్ పై నిలబడే వ్యక్తి కేసీఆర్ అయితే ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్ చేస్తాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
