
వేములవాడ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఇటీవల ప్రధాని మోదీ పర్యటించారు. ఆ సమయంలో మోదీ తన చొక్కా జేబుకు బీజేపీ పార్టీ గుర్తును పెట్టుకుని అలయంలోకి వెళ్లారని.. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందన్నారు రవీందర్ సింగ్. కాబట్టి ఎన్నికల అధికారులు వెంటనే ఎన్నికల నిబంధనలు ఉలంఘించిన మోదీపై కేసు నమోదు చెయ్యాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. రవీందర్ సింగ్ ఆద్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, జిల్లా నాయకులు పెండ్యాల మహేష్, తూల భాస్కర్ రావులు కరీంనగర్ లో ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు.