మా టైటిల్ వచ్చే వరకు న్యాయపోరాటం చేస్తాం - డైరెక్టర్ నిక్షిత్

మా టైటిల్ వచ్చే వరకు న్యాయపోరాటం చేస్తాం - డైరెక్టర్ నిక్షిత్

గత కొన్నిరోజులుగా సినిమా పరిశ్రమలో నెలకొన్న‘హాంట్’ టైటిల్ వివాదం చివరకు లీగల్ నోటీసులు వరకు వెళ్ళింది. తమకు టైటిల్ వచ్చేంత వరకు న్యాయపరమైన పోరాటం చేస్తామని డైరెక్టర్ నిక్షిత్ వెల్లడించారు. శ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో జూలై లోనే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో ‘హాంట్’ అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. ఆ తర్వాత భవ్య క్రియేషన్స్ అదే టైటిల్ ని దరఖాస్తు చేసుకుంటే  ఫిల్మ్ ఛాంబర్స్ రిజెక్ట్ చేశాయని చెప్పారు. అదే టైటిల్ ని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆమోదం చేసిందన్నారు. ఈ విషయంలో తాము ప్రశ్నిస్తే.. సమాధానం ఇవ్వకుండా మాట దాటేస్తున్నారని ఆరోపించారు. లాయర్ సురేష్ బాబు ద్వారా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, భవ్య క్రియేషన్స్ బ్యానర్ కు, వారి టీంకి నోటీసులు పంపించామని వెల్లడించారు. 

శ్రీ క్రియేషన్స్ వారి తరుపున తాను బాధ్యత తీసుకోవడం జరిగిందని అడ్వకేట్ సురేష్ బాబు  తెలిపారు. వారి వైపు న్యాయం ఉందని.. తాను కూడా ఒక నిర్మాతనేన్నారు. నిర్మాతల బాధలు, వారి కష్టాలు తెలుసు..ఏ నిర్మాత నష్టపోకూడదు అనేది తన కోరిక అన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న టైటిల్ ని వేరే ప్రొడ్యూసర్ కి ఆమోదం చేయడం ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తప్పిదమేననే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకోసం వారి తరుపున నేను వాదిస్తున్నాను అని అన్నారు.టైటిల్ తమకు వచ్చేంత వరకు పోరాడుతామని నిర్మాత నర్సింగరావ్ వెల్లడించారు. ఎంతో ఖర్చు పెట్టి,..కష్ట పడి ఈ సినిమాని తీశామన్నారు.