రెండేళ్లలో ఎలక్ట్రిక్​ వెహికల్​ను లాంచ్​ చేస్తాం : మారుతీ సుజుకీ

రెండేళ్లలో ఎలక్ట్రిక్​ వెహికల్​ను లాంచ్​ చేస్తాం : మారుతీ సుజుకీ

హైదరాబాద్​, వెలుగు: 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి ఎలక్ట్రిక్​ వెహికల్​ను లాంచ్​ చేస్తామని మారుతీ సుజుకీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ (మార్కెటింగ్​, సేల్స్​)  శశాంక్​ శ్రీవాస్తవ వెల్లడించారు. అయితే ప్రస్తుతం మొత్తం ఫోర్​ వీల్స్ అమ్మకాల్లో వీటి వాటా 1.1 శాతం కంటే తక్కువగానే ఉందని, తగినంత చార్జింగ్​ నెట్​వర్క్​ లేకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణమని చెప్పారు. హైదరాబాద్​లో శుక్రవారం 3,500వ షోరూమ్​ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు. ఈ ఏడాది అమ్మకాలు రికార్డుస్థాయిలో ఉన్నాయని, ఏప్రిల్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–అక్టోబరు మధ్య 9.57 లక్షల యూనిట్లు అమ్మామని పేర్కొన్నారు. తమ మార్కెట్​ వాటా 42 శాతానికి చేరిందని చెప్పారు. ఇక నుంచి మరిన్ని ఎస్​యూవీ, సీఎన్జీ మోడల్స్​ తెస్తామని ప్రకటించారు. త్వరలో రెండు ఎస్​యూవీలను లాంచ్​ చేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మార్కెట్​ వాటాను 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. ‘‘హైదరాబాద్​ మాకు టాప్​–3 మార్కెట్​.

ఇక్కడ నెలకు 4,500లకుపైగా వెహికల్స్​ అమ్ముతున్నాం. అయితే సెమీ కండక్టర్ల కొరత ఇప్పటికీ పూర్తిగా తీరలేదు. డిమాండ్​కు తగినంత సరఫరా చేయలేకపోతున్నాం. ఇంకా మేం 4.6 లక్షలకుపైగా వెహికల్స్​ను డెలివరీ ఇవ్వాలి. మేం ఏటా దేశవ్యాప్తంగా 200 వరకు అవుట్​లెట్స్​ను తెరుస్తున్నాం. హైదరాబాద్​లో మాకు 35 అవుట్​లెట్స్​ ఉన్నాయి. మెటీరియల్స్​ ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టే బండ్ల రేట్లను పెంచాల్సి వచ్చింది”అని ఆయన వివరించారు.  పెరిగిన డిమాండ్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా మనేసర్‌‌‌‌‌‌‌‌లోని ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని  లక్ష యూనిట్లకు పెంచుతామని కంపెనీ తెలిపింది. మారుతి సుజుకీ ఇండియాకు ప్రస్తుతం భారతదేశంలోని దాదాపు 2,250  అవుట్​లెట్లు ఉన్నాయి. కంపెనీ 2021–-22లో 237 సేల్స్ అవుట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌లను,  ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-–అక్టోబర్ మధ్య మరో 170 అవుట్‌‌‌‌‌‌‌‌లెట్లను మొదలుపెట్టిందని శ్రీవాస్తవ వివరించారు.