పార్లమెంట్‌‌పై జరిగిన దాడిని మర్చిపోలేం

పార్లమెంట్‌‌పై జరిగిన దాడిని మర్చిపోలేం

న్యూఢిల్లీ: పార్లమెంటుపై ఉగ్రమూకలు జరిపిన దాడిని ఎవరూ మర్చిపోలేరన్నారు ప్రధాని మోడీ. నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఆయన నివాళులర్పించారు. పార్లమెంటును కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ దేశం వారికెప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని మోడీ ట్వీట్ చేశారు.

భారత పార్లమెంట్ పై ఉగ్రదాడికి 19 ఏళ్లు నిండాయి. 2001లో ఇదే రోజు ఉగ్రవాదులు పార్లమెంట్ పై దాడి చేశారు. లష్కరే తోయిబా, జైషే మొహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన టెర్రరిస్టులు కారులో వచ్చి కాల్పులు జరిపారు. టెర్రరిస్టులను పార్లమెంటు భవనంలోకి వెళ్లకుండా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ సమయంలో ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌‌‌మెంట్‌‌కు చెందిన ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక సీఆర్‌‌‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్, ఇద్దరు పార్లమెంట్ వాచ్ అండ్ వార్డ్ సెక్షన్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో గార్డెన్ నిర్వాహకుడితోపాటు ఫొటో జర్నలిస్టు కూడా మృతి చెందారు.