
కోల్కతా: కలకత్తా హైకోర్టు తాజా తీర్పుపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. కోర్టు తీర్పును ఒప్పుకోబోమని ఆమె తెలిపారు. ఇది బీజేపీ కుట్ర అని, బీజేపీ ఆర్డర్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆమె ఆరోపించారు. ఎప్పట్లాగే ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘‘దేశ చరిత్రలో ఇది కళంకిత రోజు. ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేసే ముందు అన్ని సర్వేలు నిర్వహించాం.
ఇంటింటి సర్వే చేపట్టి ఓబీసీ రిజర్వేషన్ బిల్లు రూపొందించాం. కేబినెట్ తో పాటు అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. ఆ క్రమంలో కేసులు కూడా దాఖలయ్యాయి. తర్వాత ఎలాంటి ఇష్యూ రాలేదు. బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి విధానాలు ఎందుకు అమలు కావు?” అని ప్రశ్నించారు. కాగా, హైకోర్టు తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. తన ఓటుబ్యాంకు కోసం, ముస్లింలకు రిజ్వర్వేషన్లు ఇవ్వడానికి సీఎం మమత.. ఓబీసీ రిజర్వేషన్లను దోపిడీ చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.