
హైదరాబాద్, వెలుగు: విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో మూడు స్టోర్లు ఏర్పాటు చేశామని, రాబోయే రెండేళ్లలో మరో మూడు స్టోర్లను ప్రారంభిస్తామని లగ్జరీ ఫ్యాషన్ రిటైలర్ లైఫ్స్టైల్ సీఈఓ దేవ్ అయ్యర్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో పునరుద్ధరించిన స్టోర్‌ను శుక్రవారం (సెప్టెంబర్ 19) ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా కొత్తగా 16 స్టోర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇనార్బిట్స్టోర్కోసం రూ.11 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ‘‘కొత్త స్టోర్ఏర్పాటుకు ఒక్కో చదరపు అడుగుకు రూ.900 వరకు ఖర్చు అవుతోంది. మాకు సొంతగా 13 ప్రైవేటు ఫ్యాషన్ లేబుల్స్ఉన్నాయి. అనేక ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. వాటిని ఇక్కడే తయారు చేయించి అమ్ముతున్నాం.
ఈసారి పండుగ సీజన్లో అమ్మకాలు 14 శాతం వరకు పెరుగుతాయని భావిస్తున్నాం. జీఎస్టీ తగ్గింపు వల్ల దుస్తుల ధరలు ఏడుశాతం వరకు తగ్గుతాయి” అని ఆయన వివరించారు. ఈ సందర్భంగా, నటి పూజా హెగ్డే లైఫ్‌స్టైల్ కొత్త దసరా కలెక్షన్‌ను ఆవిష్కరించారు. 43,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్‌లో 300 కంటే ఎక్కువ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ల దుస్తులు ఉన్నాయి.