విశాఖపట్నం: ఇంగ్లండ్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేశామని టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ అన్నాడు. అవసరమైనప్పుడు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడి కౌంటర్ అటాక్ చేస్తామన్నాడు. ‘తొలి టెస్ట్‌లో పోప్ బాగా ఆడాడు. క్రెడిట్ అతనికే ఇవ్వాలి. అయితే రెండో టెస్ట్‌లో మేం కచ్చితంగా కౌంటర్ అటాక్ చేస్తాం. ఈసారి అలాంటి షాట్లు ఆడే చాన్సే ఇవ్వం.
ఈ మ్యాచ్ కోసం మా ప్లాన్స్‌ను సిద్ధం చేసుకున్నాం. కచ్చితంగా ఫలితాన్నిస్తాయని నమ్ముతున్నాం. ఇండియా పిచ్‌లపై చాలా మ్యాచ్‌లు ఆడాం. గత మ్యాచ్‌కు భిన్నంగా ఈసారి మేం కూడా అవసరమైనప్పుడు స్వీప్, రివర్స్ స్వీప్స్ ఆడతాం. మ్యాచ్ పరిస్థితిని బట్టి మా స్ట్రాటజీలు మారుతుంటాయి. మొత్తానికి మెరుగైన నిర్ణయాలతోనే ముందుకెళ్తాం. వ్యక్తిగత ప్రణాళికతో పాటు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తాం’ అని రెండో టెస్ట్‌కు ముందు భరత్ మీడియాతో వ్యాఖ్యానించాడు.