డబ్ల్యూటీసీ ఫైనల్ అవసరమైతే ఆరో రోజూ ఆడిస్తాం!

డబ్ల్యూటీసీ ఫైనల్ అవసరమైతే ఆరో రోజూ ఆడిస్తాం!
  • అవసరమైతే ఆరో రోజు!
  • డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్లేయింగ్​ కండిషన్స్​పై ఐసీసీ కసరత్తు 
  • ఎలాగైనా విన్నర్‌ను తేల్చాలని భావిస్తున్న  కౌన్సిల్‌
  • ఈ వారంలో ప్లేయింగ్‌ రూల్స్​ వెలువడే చాన్స్

వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ మెగా ఫైనల్ మ్యాచ్​ డ్రా అయితే విన్నర్​ ఎవరు?  వర్షం వల్ల ఒకట్రెండు రోజుల ఆటను కోల్పోతే పరిస్థితేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. రిజర్వ్‌ డే ఉంటుందని ఇదివరకే ప్రకటించినా.. తాజాగా ఈ క్లాజ్‌ను తన వైబ్‌సైట్‌ నుంచి తొలగించడంతో సందిగ్ధం నెలకొంది.  అయితే, ప్రతికూల వాతావరణం, స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా  ఐదు రోజుల్లో నిర్ణీత ఓవర్లు పూర్తి కాకపోతే  ఆటను ఆరో రోజుకు పొడిగించే విషయంపై ఐసీసీ ఆలోచన చేస్తోందని సమాచారం. ఈ మేరకు ఇండియా–న్యూజిలాండ్​ మధ్య  సౌతాంప్టన్​లో జరిగే ఈ మెగా ఫైనల్‌ ప్లేయింగ్​ కండిషన్స్​పై ఈ వారంలో ఐసీసీ క్లారిటీ ఇవ్వనుంది. అంతేకాక  డబ్ల్యూటీసీ భవితవ్యంపై కూడా  కీలక నిర్ణయం తీసుకునే చాన్స్​ కనిపిస్తోంది.  

దుబాయ్: ​వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ ఫస్ట్​ ఎడిషన్​ను సక్సెస్​ఫుల్​గా కంప్లీట్​ చేయడంపై ఇంటర్నేషనల్​ క్రికెట్​ కౌన్సిల్ (ఐసీసీ)​ దృష్టి సారించింది. కరోనా దెబ్బకు డబ్ల్యూటీసీ లీగ్​స్టేజ్ మ్యాచ్​ల షెడ్యూల్‌‌లో  మార్పులు జరిగాయి.  దాంతో ఫైనలిస్టులను తేల్చేందుకు పాయింట్స్​ పర్సంటేజ్​​ సిస్టమ్​ను ప్రవేశపెట్టింది. దాని ప్రకారం టేబుల్​ టాపర్స్‌‌గా నిలిచిన ఇండియా, న్యూజిలాండ్​ ఫైనల్​కు చేరాయి.  సౌతాంప్టన్​ వేదికగా జూన్​18–22 మధ్య జరిగే టైటిల్‌‌ ఫైట్‌‌లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.  డబ్ల్యూటీసీ తొలి ఎడిషన్​ కావడంతో  ఫైనల్ మ్యాచ్​లో కచ్చితంగా రిజల్ట్​ తేలాలని ఐసీసీ కోరుకుంటోంది. ఏ కారణం వల్ల ఆటను కోల్పోయి మ్యాచ్​ డ్రా గా ముగియకూడదని చూస్తోంది. ఈ మేరకు తొలి ఎడిషన్​ ఫైనల్​ మ్యాచ్​ ప్లేయింగ్​ కండిషన్స్​పై ఇంటర్నేషనల్ బాడీ కసరత్తు చేస్తోంది. ఈ వీకెండ్​లోగా ఇరు జట్లకు రూల్స్, రెగ్యులేషన్స్​ను అందించే చాన్స్​ కనిపిస్తుంది. అయితే,  ఒకవేళ మెగా ఫైనల్ డ్రా గా ముగిస్తే విజేతగా ఎవరిని ప్రకటిస్తారనే అంశంపై  కన్ఫ్యూజన్​ఉన్న సంగతి తెలిసిందే. దీనికి  పరిష్కారంగా మ్యాచ్​కు ఓ రిజర్వ్​ డే  కేటాయించాలని డబ్ల్యూటీసీని క్రియేట్‌‌ చేసినప్పుడే  ఐసీసీ  నిర్ణయించింది. ఈ మేరకు   ఫ్రీక్వెంట్లీ ఆస్క్‌‌డ్​ క్వశ్చన్స్​(ఎఫ్​ఏక్యూ)లో రిజర్వ్‌‌ డేను చేర్చింది. కానీ, ఇప్పుడా క్లాజ్‌‌ను ఐసీసీ తమ వెబ్‌‌సైట్‌‌ నుంచి తొలగించింది.  ఇదికాక, మ్యాచ్​ డ్రా అయితే ఇరుజట్లను జాయింట్​ విన్నర్స్​గా ప్రకటించాలని కూడా ఐసీసీ తొలుత భావించింది.  అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు సంబంధించి ముందుగా అనుకున్న ప్లాన్స్‌‌ ప్రకారం రిజర్వ్​డేకే  ఐసీసీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.  నిర్ణీత ఐదు రోజుల్లో  ప్లేయింగ్​అవర్స్​కు ఆటంకం ఏర్పడితే వాటిని అదనంగా కేటాయించిన ఆరో రోజు కంప్లీట్​ చేయాలని చూస్తోంది. ‘సాధారణంగా మ్యాచ్​జరిగే ఐదు రోజుల్లోనే 30 గంటల ఆట పూర్తి చేయాలనేది మా లక్ష్యం. అయితే, ఏ కారణం వల్లనైనా ఆ 30 గంటలు కంప్లీట్​చెయ్యలేకపోతే ఆరో రోజున మిగిలిన ఆట ఆడించాలని అనుకుంటున్నాం.  దానివల్ల మ్యాచ్‌‌ రిజల్ట్‌‌పై వాతావరణం ప్రభావాన్ని చాలావరకు తగ్గించొచ్చు’ అని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్లేయింగ్​అవర్స్​ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఐసీసీకి మరికొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్లేయింగ్​అవర్స్​ప్రాతిపదిక అయితే అప్పుడు స్లో ఓవర్​ రేట్​అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇటీవల కాలంలో  స్లో ఓవర్​ రేట్​అనేది మ్యాచ్​ల్లో సాధారణంగా మారింది. రూల్స్​ ప్రకారం రోజుకు 90 చొప్పున ఐదు రోజుల మ్యాచ్​లో  గరిష్టంగా 450 ఓవర్లు పడాలి.  ఉదాహరణకు రెండో రోజు ఆటలో ఏడు ఓవర్లు తక్కువ పడితే వాటిని థర్డ్​ డే కోటాలో పూర్తి చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో  స్లో ఓవర్​ రేట్​కు పెద్దగా ప్రాధాన్యముండదు. అదే వర్షం ఆటంకం కలిగించి ఒక రోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోతే మాత్రం అవస్థలు తప్పవు. వర్షం వల్ల  ఒకట్రెండు సెషన్లు లేదా ఒక రోజు ఆటను కోల్పోతే రిజర్వ్​ డేలో కంప్లీట్​చెయ్యవచ్చు. కానీ రెండు రోజుల ఆట నష్టపోతే ఇంటర్నేషనల్​ బాడీ ఏం చేస్తుందో చూడాలి.

జాయింట్​ విన్నర్స్‌‌పై నో ఇంట్రస్ట్‌‌
డబ్ల్యూటీసీ ఫస్ట్​ఎడిషన్​కావడంతో జాయింట్​ విన్నర్స్​ కాన్సెప్ట్​పై ఐసీసీ అంతగా ఆసక్తి చూపడం లేదు. కచ్చితంగా మ్యాచ్​విన్నర్​ ఉండాలనే చూస్తున్నది. ‘డబ్ల్యూటీసీ ఫస్ట్​ ఎడిషన్​ కావడం వల్ల జాయింట్​ విన్నర్స్​ కాన్సెప్ట్​పై పెద్దగా ఆసక్తి లేదు. మ్యాచ్​రిజల్ట్​తేలేందుకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనిపై ఐసీసీ కమిటీ వర్క్​చేస్తుంది. ఈ వారంలో ప్లేయింగ్​కండిషన్స్​వెలువడే అవకాశం ఉంది’అని ఐసీసీ కి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.

డబ్ల్యూటీసీ కొనసాగింపు కష్టమే!
వరల్డ్​ టెస్ట్ చాంపియన్​షిప్​ భవితవ్యంపై ఐసీసీలో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పుడున్న సిచ్యువేషన్​లో డబ్ల్యూటీసీని కొనసాగించే అవకాశం కనిపించడం లేదు. జూన్​ ​1న జరగబోయే ఐసీసీ బోర్డు మీటింగ్​లో డబ్ల్యూటీసీ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నిజానికి, 2019లో డబ్ల్యూటీసీని ప్రకటించనప్పుడే 2021–23 సీజన్​ కూడా ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. అంతేకాక మిగిలిన ఐసీసీ టోర్నీల మాదిరిగానే డబ్ల్యూటీసీ కొనసాగుతుందని పేర్కొంది. అయితే, త్వరలో ఇండియా, ఇంగ్లండ్​ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​ ఆడనున్న సంగతి తెలిసిందే.  2021–23 సీజన్​లో ఇండియాకు ఇది తొలి సిరీస్​ కాగా, డబ్ల్యూటీసీ సెకండ్​ ఎడిషన్​పై ఐసీసీ నుంచి ఎలాంటి అప్​డేట్​ లేదు. అంతేకాక డబ్ల్యూటీసీ కొనసాగింపునకు ఐసీసీ బోర్డు సభ్యుల్లో చాలా మంది ఇంట్రస్ట్​ చూపడం లేదు.

క్వారంటైన్‌లోనూ కసరత్తులు
మూడు నెలలకుపైగా సాగే యూకే టూర్​ కోసం ముంబై చేరుకున్న టీమిండియా క్రికెటర్లు ముంబైలోని ఓ హోటల్‌లో హార్డ్‌ క్వారంటైన్​లో ఉన్నప్పటికీ తమ  ఫిట్​నెస్​ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. బయోబబుల్లో ప్రత్యేక జాగ్రత్తలతో ఏర్పాటు చేసిన జిమ్​లో క్రికెటర్లంతా చెమటోడ్చారు. ఇందుకు సంబంధించి బీసీసీఐ బుధవారం ఓ వీడియోను రిలీజ్​ చేసింది. వైస్​ కెప్టెన్​ అజింక్యా రహానె, రిషబ్​ పంత్​, మహ్మద్​ సిరాజ్​, మహ్మద్​ షమీ, వాషింగ్టన్​ సుందర్​, మయాంక్​ అగర్వాల్​, ఇషాంత్​ శర్మ తదితరులు  రకరకాల ఎక్సర్​సైజ్​లు చేయడం ఆ వీడియోలో కనిపించింది. ఫిట్​నెస్​ ట్రెయినింగ్​కు సంబంధించి  పంత్​ కూడా ఓ వీడియో పోస్ట్​ చేశాడు. తనలోని అథ్లెటిక్​ ఎబిలిటీస్​ పెంచుకునేందుకు స్పెషల్​ వర్కౌట్స్​ చేస్తూ కనిపించాడు. ముఖ్యంగా బాడీని పూర్తిగా  వెనక్కు  వంచిన పంత్​ వహ్వా అనిపించాడు.