జైలర్ ఎగ్జామ్స్పై వారం రోజులే డెడ్ లైన్

జైలర్ ఎగ్జామ్స్పై వారం రోజులే డెడ్ లైన్
  • ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్

హైదరాబాద్: జైలర్ ఎగ్జామ్స్ నిర్వహణలో తప్పు జరిగిందని చెప్పిన అధికారులు.. పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించడానికి వారం రోజుల గడువు ఇస్తున్నామని ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రకటించారు. జైలర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తున్నామని ప్రకటించాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. ‘జైలర్ ఎగ్జామ్స్పై నిర్ణయానికి వారం రోజులే డెడ్ లైన్.. జైలర్ పరీక్ష రద్దు చేసి కొత్త తేదీలు ప్రకటించాలి.. జైలర్ ఎగ్జామ్ రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన వెల్లడించారు.

గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేము ప్రతిసారి సమస్యలని తీసుకొచ్చినప్పుడు అభ్యర్థులు లేరని చెప్తున్నారు.. అందుకే అభ్యర్థులను మీడియా ముందుకు తీసుకొచ్చామన్నారు. ‘జులై 17వ తేదీన జైలర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.. ఆ రోజే జగ్గారెడ్డి , నేను ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించాం... కొంతమంది అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకుని మాస్ కాపీయింగ్ చేశారు..’ అని బల్మూరి వెంకట్ ఆరోపించారు. 
తప్పు జరిగిందని చెప్పిన అధికారులు ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉందన్నారు. ఇప్పటివరకు ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తామని.. ఎప్పుడు కండక్ట్ చేస్తామన్నది కూడా క్లారిటీ చెప్పడం లేదు..వెంటనే ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మరలా ఎగ్జామ్ కండక్ట్ చేసే తేది ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ‘మీకు ఏడు రోజులు సమయం ఇస్తున్నాం.. సంబంధిత సీఎండీ , అధికారులు నిర్ణయం  ప్రకటించాలి.. వారం రోజుల్లో మా డిమాండ్స్ పరిష్కరించకపోతే 50వేల మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.. విద్యా శాఖ మంత్రి నివాసాన్ని.. ప్రగతి భవన్ ని ముట్టడిస్తాం..’ అని బల్మూరి వెంకట్ హెచ్చరించారు. ట్రాన్స్ కో.  జెన్కో లో ఉన్న రెండు వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.