కాంగ్రెస్ పోరాటానికి సహకరిస్తాం: బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ

కాంగ్రెస్ పోరాటానికి సహకరిస్తాం:  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ

బషీర్​బాగ్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం జాతీయ స్థాయిలో పోరాడుతున్న కాంగ్రెస్​కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ చెప్పారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శనివారం మాట్లాడారు. ఈ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి మోడీని కలవాలని సీఎం రేవంత్​రెడ్డికి సూచించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చితే తప్ప సమస్య పరిష్కారం కాదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ చొరవ చూపాలని కోరారు.