రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 రైతులకు అన్యాయం జరిగితే  సహించేది లేదు :  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజా ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగితే  సహించేది లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ధాన్యానికి రైస్ మిల్లర్స్ మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మిర్యాలగూడలో మంత్రి కోమటిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   స్థానిక ఎమ్మెల్యే, అధికారులు చెప్పిన తీరు మారని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.  

సీనియర్ మంత్రిగా మిల్లర్లను  తాను హెచ్చరిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకున్నప్పుడు రైతులకు మేలు చేయడానికి ప్రయత్నం చేయండని మిల్లర్లను కోరారు.  అకాల వర్షాలకు కలిగిన  పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామరని మంత్రి హామీ ఇచ్చారు.  

అవసరమైతే ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ వద్ద మోకరిల్లి కృష్ణ గోదావరి నీళ్లను ఆంధ్రకు తరలించారని కోమటిరెడ్డి ఆరోపించారు.  దక్షిణ తెలంగాణ అని మొత్తం నాశనం చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని విమర్శించారు.