చేనేత కళను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

చేనేత కళను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

బషీర్​బాగ్, వెలుగు: చేనేత కార్మికులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ఈ కళను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు రేవంత్​రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నారాయణగూడ పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ ప్రదర్శనను శనివారం ఆయన తిలకించారు. ప్రదర్శన ఏర్పాటు చేసిన పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు రూపాను అభినందించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. విదేశాలకు చేనేత వస్త్రాలు ఎగుమతి అయ్యేలా తనవంతు కృషి చేస్తానన్నారు.