V6 News

పురాతన కట్టడాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం..కల్వకుర్తి గచ్చుబావి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి 

పురాతన కట్టడాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం..కల్వకుర్తి గచ్చుబావి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి 
  •     ఎక్సైజ్, పర్యాటక శాఖ  మంత్రి  జూపల్లి కృష్ణారావు 

కల్వకుర్తి, వెలుగు :  కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని గచ్చుబావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ  మంత్రి  జూపల్లి కృష్ణారావు అన్నారు.  ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి పట్టణంలోని పురాతన శివాలయం గచ్చుబావిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గచ్చుబావిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రజా ప్రభుత్వం పురాతన కట్టడాలను కాపాడేందుకు కృషి చేస్తోందని తెలిపారు. 

చారిత్రక నేపథ్యం కలిగిన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. కార్యక్రమంలో  నాయకులు ఆనంద్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్​పర్సన్ శాన్ వాజ్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, భూపతిరెడ్డి,  బొమ్ము ఆంజనేయులు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాములు, రామ కాంత్ రెడ్డి ఉన్నారు.