మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు : జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చడమే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. సోమవారం నగరంలోని పది ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రిపుల్ఐటీ కళాశాలలో జిల్లా విద్యార్థులు అత్యధిక సంఖ్యలో సీట్లు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పేరు తేవాలని సూచించారు.
నియోజకవర్గంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో ఉచితంగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ పింపిణీ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకుడు గుండా మనోహర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాహేర్, అజిమ్, అనిల్ పాల్గొన్నారు.
