ప్రభుత్వ పథకాలు కార్యకర్తల చేతుల మీదుగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం

ప్రభుత్వ పథకాలు కార్యకర్తల చేతుల మీదుగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం
  • ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు 

సంగారెడ్డి జిల్లా: టీ ఆర్ ఎస్ కార్యకర్తల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. రెండుసార్లు టీ ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా కార్యకర్తల వల్లే కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు కార్యకర్తల చేతుల మీదుగా ఇచ్చే విధంగా ప్రయత్నిస్తామని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కార్యకర్తల త్యాగల వల్లనే అధికారంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.  సంగారెడ్డి జిల్లా  టీ ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలసి మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా కార్యకర్తలు సైనికుల్లా ఉండాలన్నారు.  పార్టీ పుట్టి 20 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా సభ్యత్వాలు భారీగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 50 వేలకు తగ్గకుండా సభ్యత్వాలు చేయాలని ఆయన సూచించారు. టీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందాయని ఆయన గుర్తు చేశారు. గులాబీ జెండా తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష.. అంతేకాదు టీ ఆర్ ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. సమైక్య రాష్ట్రంలో నాయకుల మెడలు వంచి తెలంగాణ తీసుకువచ్చిందన్నారు. ప్రతిపక్ష నాయకులు పొరుగు రాష్టాలు కర్ణాటక, ఛత్తీస్ గఢ్ కు వెళ్లండి.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి  ఏంటో తెలిసొస్తుందని, దేశంలో ఎక్కడలేని విధంగా టీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నదని మంత్రి హరీష్ రావు వివరించారు. త్వరలోనే సీఎం చేతుల మీదగా సంగారెడ్డి జిల్లా  టీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం చేద్దామని, ప్రతి మండలానికి వెళ్లి కార్యకర్తలను కలిసి మంచి చెడులు తీసుకుంటామని చెప్పారు.

ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి – ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

ప్రతిపక్షలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, వారి అసత్య ప్రచారలను కార్యకర్తలు తిప్పి కొట్టాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. టీ ఆర్ ఎస్ కార్యకర్తల కృషి వల్లనే రెండు సార్లు టీ ఆర్ అస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి

ముఖ్యమంత్రులను ఉరికిచ్చిన చరిత్ర కేసీఆర్ ది.. మీరెంత?

తెలంగాణకు..నాకు ప్రత్యేక అనుబంధం 

ఆలస్యమైందని నిరాశ వద్దు.. అందరికీ న్యాయం జరుగుతుంది

తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసిన కృష్ణా బోర్డ్