రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారని అనుకోం

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారని అనుకోం

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారని తాము  అనుకోవడం లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్  మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోకుండా ఆయన్ని ఆపడానికి.. చివరి వరకు ట్రై చేస్తామని చెప్పారు. ఉత్తమ్, దిగ్విజయ్ సింగ్ తో పాటు మరికొందరు ఆయనతో మాట్లాడుతున్నారని తెలిపారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ‘‘ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే రాష్ట్రంలో ఓ బ్రాండ్ ఉంది. అలాంటి నాయకున్ని వదులుకోం. ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది’’ అని స్పష్టం చేశారు. 
 
సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతలు పిలుస్తున్నారు కానీ..నేనే ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కేసీఆర్ను ఓడించే పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్పారు.  కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసింది నిజమేనని.. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తా అన్నారు. తన నియోజకవర్గానికి డెవలప్మెంట్ నిధులు రాకుండా టీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.