కేంద్రంతో కలిసి పనిచేస్తం.. మోడీ ఆశీర్వాదం కావాలి

కేంద్రంతో కలిసి పనిచేస్తం.. మోడీ ఆశీర్వాదం కావాలి

ఢిల్లీని నెంబర్ వన్ సిటీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలసి పనిచేయాలని భావిస్తున్నామని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో పాలన సజావుగా
సాగేందుకు ప్రధాని మోడీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఆదివారం రామ్‌‌‌‌లీలా మైదానంలో ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేశాక కేజ్రీవాల్‌‌‌‌ మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు చేసిన విమర్శలను తాము పట్టించుకోబోమని, అందరినీ కలుపుని పనిచేస్తూ ముం దుకు వెళతామని ప్రకటించారు. దేశ రాజకీయాలను ఢిల్లీ ప్రజలు మార్చేశారని కితాబిచ్చారు. ‘‘మీ కొడుకు మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఇది నా గెలుపు కాదు. మీది”అంటూ ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ అన్నారు. తాను ఎవరిపైనా సవతి తల్లి ప్రేమను చూపలేదని, ఐదేండ్ల పాటు అందరి కోసం పనిశానని, అందరినీ ఒకేలా చూశానని చెప్పారు. గత ఐదేండ్లు వేగంగా ఢిల్లీని అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నించామని, వచ్చే ఐదేండ్లు దానిని కొనసాగించే ప్రయత్నం చేస్తామన్నారు. ఎన్నికల్లో కొందరు ఆప్ కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు కాం గ్రెస్ కు ఓటేశారని, రాజకీయ సిద్ధాంతాలు వేరైనా రెండు కోట్ల మంది ఢిల్లీ ప్రజలంతా తన కుటుంబమేనని చెప్పారు.

ఉచిత స్కీముల గురించి మాట్లాడుతూ.. కనీస వసతులైన ఆరోగ్యం , విద్యకు కూడా చార్జీలు తీసుకుంటే అంతకంటే సిగ్గుచేటులేదని కేజ్రీవాల్ అన్నారు. భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ తన స్పీచ్ ప్రారంభించిన కేజ్రీవాల్.. హమ్ హోంగే కామ్ యాబ్ అంటూ ప్రసంగాన్ని ముగించారు. ప్రమాణస్వీకారం తర్వాత 20 నిమిషాల పాటు కేజ్రీవాల్ ప్రసంగించారు. అంతకుముందు రామ్ లీలా మైదాన్ లో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్.. కేజ్రీవాల్ తో ప్రమాణం చేయించారు. ఆప్ ఎమ్మెల్యేలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, రాజేం ద్రపాల్ గౌతం, ఇమ్రాన్ హుస్సే న్ కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణం చేశారు.

సామాన్యులే స్పెషల్ గెస్ట్​లు

ఢిల్లీ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. గత ఐదేండ్లలో ఢిల్లీలో మార్పు రావడానికి వీరే కారణమని ఆప్ పార్టీ
కొనియాడింది. అలాగే వివిధ రంగాలకు చెందిన 50 మందిని కూడా స్పెషల్ గెస్ట్​లు గా పిలిచింది. ఈ లిస్ట్​లో రైతులు, నైట్ షెల్టర్ లో పనిచేసే ఓ వ్యక్తి, శానిటేషన్ వర్కర్, బస్ మార్షల్స్, అంగన్ వాడీ వర్కర్స్, హెల్త్​ కేర్ సిబ్బంది ఇలా చాలా మంది ఉన్నారు. తమకు ఇలాంటి అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించ లేదని, పని చేయడమే కాకుండా చేసిన పనికి గుర్తింపు ఇవ్వడంలో ఆప్ ప్రభుత్వం ముందుందని వారంతా చెప్పా రు.

కట్టుదిట్టమై న భద్రత

కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా ఢిల్లీ పోలీసులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. దాదాపు 5 వేల మంది పోలీసులు,
పారామిలిటరీ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తల కోసం