ఈ సారి మన టార్గెట్ 67 తగ్గకూడదు

ఈ సారి మన టార్గెట్ 67 తగ్గకూడదు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లకు తగ్గకుండా గెలవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్. జనవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మరోసారి ఘనవిజయం సాధించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. 2015 ఎన్నికల్లో  67 సీట్లు గెలిచామని..ఈ సారి కూడా అంతకన్నా ఎక్కువ సీట్లే తమ లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. రాజకీయ  సలహాదారు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో అమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది