నాటు నాటు కోసం రోజుకు 3గంటల కష్టపడ్డాం : ఎన్టీఆర్

నాటు నాటు కోసం రోజుకు 3గంటల కష్టపడ్డాం : ఎన్టీఆర్

ప్రపంచ వేదికపై ఆర్ఆర్ఆర్ సత్తాచాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగా కేటగిరీలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. అయితే, ఈ పాటకు డాన్స్ చేయడం కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ చాలా శ్రమించారు. ఇద్దరు కలిసి ఒకే సింక్ లో డ్యాన్స్ చేయడం చాలా కష్టపడ్డారని ఎన్టీఆర్ చెప్పారు. అందుకు ప్రతి రోజూ మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేసేవాళ్లమని ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పంచుకున్నారు. ‘ఇద్దరి డ్యాన్స్ లో కో ఆర్డినేషన్ కోసం చాలా టేక్ లు తీసుకోవాల్సి వచ్చింది. రాజమౌళి ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టలేదు. కో ఆర్డినేషన్, సింక్ కోసం చాలా కష్టపడ్డాం. నాటు నాటు స్టెప్పు కోసం ఏకంగా 18 టేకుల వరకూ తీసుకున్నాం.సినిమా విడుదలయ్యాక మా ఇద్దరి మధ్య సింక్ బాగా కుదిరిందని అందరూ ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంద’ని ఎన్టీఆర్ అన్నారు.