మాస్కు లేకుండా బయటికొస్తే రూ.1,000 ఫైన్

మాస్కు లేకుండా బయటికొస్తే రూ.1,000 ఫైన్
  • రెండోసారి పట్టుబడితే రూ.2,000 పెనాల్టీ

బెంగళూరు: బహిరంగ ప్రదేశాలలో, పని ప్రదేశాల్లో, ఆఫీసుల్లో మాస్క్ ధరించడం కంపల్సరీ చేస్తూ బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) ఉత్తర్వులిచ్చింది. బెంగళూరు సిటీలో ఫేస్ మాస్క్ ధరించకుండా బయటికి వచ్చిన వారికి రూ.వెయ్యి పెనాల్టీ వసూలు చేస్తామని ప్రకటించింది. ఓపెన్ ప్లేసుల్లో ఉమ్మివేయడం, యూరిన్ పాస్ చేయడం, చెత్త వేయడం పై కూడా బీబీఎంపీ బ్యాన్ విధించింది. ఈ ఆదేశాల ఉల్లంఘనలకు మొదటిసారి రూ.1,000, రెండో సారికి రూ .2,000 జరిమానా విధిస్తామని ఉత్తర్వులిచ్చింది. ఈ ఆదేశాలు గురువారం అర్ధరాత్రి నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు అమల్లో ఉంటాయని ప్రకటించింది. రూల్స్ ఉల్లంఘించి వ్యక్తులు, కంపెనీలపై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, 1897, విపత్తు నిర్వహణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపింది.