200 ఏళ్ల చరిత్రలో ఇంతటి భారీ వర్షాలు నాలుగోసారి

200 ఏళ్ల చరిత్రలో ఇంతటి భారీ వర్షాలు నాలుగోసారి

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు వదలటం లేదు. ఏపీకి మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడపకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో చిత్తూరు, కడప జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ఏపీ సర్కార్. గుంటూరు, అనంతపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొమరిన్, శ్రీలంక తీర ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతాయని చెప్పారు. కడప జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. చాలా ఏరియాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైల్వే కోడూరులో గుంజనా నదీ పరివాహక ప్రాంతంలో ఓ ఇల్లు కూలిపోయింది. 

200 ఏళ్ల చరిత్రలో ఇలా భారీ వర్షం నాలుగోసారి

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తమిళనాడును వణికిస్తోంది. చెన్నైతో పాటు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామేశ్వరం తడిసి ముద్దయింది. రోడ్లపై వాన నీరు ప్రవహిస్తోంది. ఇంకా వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో కోస్తా తీర జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 2015 తర్వాత ఇప్పుడే అధిక వర్షపాతం నమోదైందన్నారు అధికారులు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 27 వరకు 119 సెంటీ మీటర్ల వర్ష పడింది. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. చెన్నైలో నగర చరిత్రలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం 200 ఏళ్ల చరిత్రలో ఇది నాలుగోసారి.