పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నల్గొండ జిల్లాల్లో మోస్తారు వానలు పడే సూచన కనిపిస్తోంది. అలాగే  యాదాద్రి భువనగిరి, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, నిజాంబాద్, రాజన్న సిరిసిల్ల, జనగాం, సూర్యాపేట, జగిత్యాల్, నిర్మల్, కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.