హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన

హైదరాబాద్ : సిటీలో వర్షం దంచి కొడుతుంది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ అంతటా కుండపోత వర్షం కురుస్తుంది. అటు తెలంగాణలోనూ పలుచోట్ల భారీ వర్షం పడుతుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ములుగు, వనపర్తి, రంగారెడ్డి, సిద్ధిపేట, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయ్. ఉత్తర దక్షిణ ద్రోణి తెలంగాణ రాయలసీమ మీదుగా ఏర్పడిందని తెలిపారు వాతావరణశాఖ అధికారులు. దీంతోపాటు.. ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉందని తెలిపారు. జులై 21న వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. వీటి ప్రభావంతో.. రాష్ట్రంలో మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.