తెలంగాణకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్

 తెలంగాణకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్

హైదరాబాద్: బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సముద్ర మట్టం నుండి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణి ఇవాళ మరింత విస్తరిస్తోంది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రదేశం వరకు కొనసాగుతోందని వాతావరణశాఖ ప్రకటించింది. 

ఈ ద్రోణి ప్రభావంతో రాగల 48 గంటల్లో అంటే.. సెప్టెంబర్ 07వ తేదీలోగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆ తదుపరి 48 గంటలులో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 

ద్రోణి విస్తరిస్తుండడంతో ఇవాళ తెలంగాణా రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కురిసే  అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి  చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు.. అక్కడక్క ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షములు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణశాఖ అంచనా వేసింది.