తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రం మీద తగ్గిన ద్రోణి ప్రభావం ఉందని వెల్లడించింది. ఇవాళ (20 మే 2024), రేపు(21 మే 2024) ఎలాంటి హెచ్చరికలు లేవని సూచించింది. రెండు రోజుల తర్వాత పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు, హైదరాబాద్ లో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో సగటున 36 నుండి 41 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది.ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత వల్ల 41 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఇవాళ మాల్దీవ్లో కొంతవరకు, దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలా వరకి విస్తరించాయని తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కాదులుతున్నాయని వెల్లడించింది. మరి కొద్ది రోజుల్లో ఈ నెల చివరి వరకు కేరళని తాకి జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.
మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. మే 24 నాటికి వాయుగుండంగా మారనుందని హెచ్చరించింది. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
