జులై నెలలో వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జన జీవనం పూర్తిగా స్థంభించిపోయింది. వాగులు వంకలు సైతం పొంగిపొర్లాయి. ప్రాజెక్టులన్నీ నిండు ఉండాల జలకళ సంతరించుకున్నాయి. ఆగస్టు నెలలో మాత్రం వర్షాల జాడ లేకుండా పోయింది. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు మళ్లీ భారీగా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రెండురోజుల ( ఆగన్టు 20,21) పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
వారం రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు. కొంతకాలం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షపు చినుకు సందడి చేసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో చాలాచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో కూడా తెలికపాటి జల్లులు పడ్డాయి. ఇదే ముసురు మరో రెండురోజుల పాటు కొనసాగవచ్చు. కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల,ఆదిలాబాద్, కొమురం భీమ్ సహా మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణశాఖ అధికారులు. రాబోయే మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తీరం వెంబడి 30 నుంచి 40 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయని, మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది
