ఉత్తర భారతంపై చలి పంజా..

ఉత్తర భారతంపై చలి పంజా..

ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. ఢిల్లీ సహా చాలా రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కప్పేసింది. ఢిల్లీలో తెల్లవారుజామున 6 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు,  ఉదయం 8 గంటల తర్వాత పది డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ఉదయం 11 గంటలకు వరకు సరిగ్గా ఎండ రావడం లేదు. వచ్చినా..చలి తగ్గడం లేదు. దీంతో చిరు వ్యాపారులు, జనాలు బయటకు రాలేకపోతున్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

పట్టణాలు, పల్లెల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. చలి నుంచి బయటపడేందుకు చలి మంటలు వేసుకుంటున్నారు జనం. చలి తీవ్రత పెరుగుతుండడంతో ఫుట్ పాత్ ల వెంట అమ్మే స్వెటర్లు, జర్కిన్ లు, మంకీ టోపీలకు గిరాకీ పెరిగింది. కొద్ది రోజుల వరకు ఆరోగ్య జాగ్రత్తలు అవసరమంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు మరీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత మొదలవుతోంది. ఇధి వ్యాపారంపై కూడా ప్రభావం చూపుతోంది. పట్టణాల్లో వ్యాపారులు రాత్రి 8 గంటలకే దుకాణాలను మూసి వేస్తున్నారు. చిరు వ్యాపారులు రాత్రి 7 గంటలకే వ్యాపారాన్ని ముగించుకుని ఇంటి బాట పడుతున్నారు. 

అది అలా ఉంటే....రోడ్లపై వాహనాలు లైట్లు వేసుకుని వెల్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రమాదాలు జరిగే చాన్స్ ఉండటంతో..నెమ్మదిగా వెళ్తున్నారు వాహనదారులు. ఇక ఢిల్లీ సహ నార్త్ లోని చాలా రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో విమాన, రైళ్ల సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.