
వరంగల్సిటీ, వెలుగు: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. వెబ్ కౌన్సిలింగ్ కు సంబంధించిన వివరాలను కాళోజీ హెల్త్ వర్సిటీ బుధవారం వెల్లడించింది. అభ్యర్థులు డిసెంబర్1వ తేదీ రాత్రి 7గంటల లోపు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని చెప్పింది. వివరాలకు https://tspvtmedadm.tsche.in/ www.knruhs.telangana.gov.in ను చూడాలని తెలిపింది.
ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలోని ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చింది. డిసెంబర్ 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఆన్ లైన్ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మెరిట్ లిస్ట్ ను విడుదల చేస్తామన్నారు. వివరాల కు www.knruhs.telangana.gov.in ను చూడాలంది.