
వరంగల్ సిటీ, వెలుగు : ప్రభుత్వ, ప్రైవేటు దంత కళాశాలల్లో కన్వీనర్ కోటా బీడీఎస్ ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 10గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 2గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితా, కళాశాలవారిగా సీట్ల వివరాలను వెబ్ సైట్లో చూసుకోవచ్చు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.