జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఆగస్టు( 2నుంచి 8 వరకు) మొదటి వారంలో కుజుడు శుక్రుడు వంటి కీలక గ్రహాల సంచారాలు, వాటి కలయికతో ఏర్పడే శుభ యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానున్నాయి. పండితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రహాల మార్పుతో ఏ రాశి వారికి అదృష్టం కలిసి ఉంటుంది.12 రాశుల వారి వారఫలాలను తెలుసుకుందాం..!
మేష రాశి : ఈ రాశి వారికి ఈవారం రాజయోగం.. ధనలాభం కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కూడా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
వృషభ రాశి : ఈరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ఆత్మగౌరవం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. . అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు వృద్ధి చెందుతాయని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో పెండింగులో ఉన్న బకాయిలన్నీ లభిస్తాయి. స్నేహితులు, ప్రియమైన వారితో యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.. మీరు చేసే ప్రతి పనిలో మంచి విజయం సాధిస్తారు.ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. పలుకుబడి బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈ వారంలో మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వీరి కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. బంధువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఎంతోకాలంగా ఉన్న రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తారు. ముఖ్య మైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. తలపెట్టిన ప్రతి పని నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారంతో బాధ్యతలను పూర్తి చేస్తారు.
సింహ రాశి : ఈ రాశి వారు ఈ వారంలో కోపం.. ఆవేశం తగ్గించుకోవాలని పండితులులు సూచిస్తున్నారు. తొందరపాటు నిర్ణయాల వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎవరికి అప్పులు ఇవ్వవద్దు. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కేరీర్ విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. ఆర్థికవిషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. వృత్తి పరంగా.. వ్యాపార పరంగా కొన్ని ఆటంకాలు కలుగుతాయి. ప్రతి విషయంలో కూడా ఓర్పు.. సహనం పాటించండి. ఆరోగ్య వి షయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసర విషయాల జోలికి వెళ్లవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కన్యా రాశి : ఈ రాశివారికి ఈ వారంలో గ్రహాల మార్పు కారణంగా ఆర్థిక పరిస్థితి బలపడటమే కాకుండా.. ప్రతి పనిలో కూడాయ మంచి విజయం సాధిస్తారు. కొన్ని శుభకార్యాలు జరుగుతాయి దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి.
తుల రాశి : ఈ రాశి వారికి ఈ వారంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. గురుడి శుభ దృష్టివలన మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.ముఖ్యంగా డబ్బు రాబడి పెరుగుతుంది. జీవిత భాగ స్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. వ్యాపారవేత్తలకు ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలు పొందుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కొంతమంది ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. పాత మిత్రులు కలుసుఉంటారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వారం చివరిలో అనవసర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. మీరు ఆచరించాల్సిన పనులను ప్లాన్ ప్రకారం పూర్తి చేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. విదేశాల్లో స్థిరపడాలనుకునేవారికి మంచి సమయమని చెప్పవచ్చు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. పెళ్లి కోసం ఎదురుచూసే వారు గుడ్ న్యూస్ వింటారు.ప్రేమ వ్యవహారాల్లో ఆనందం పొందుతారు.
మకర రాశి : ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహబలం అనుకూలంగా ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులు తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి. పెద్దమొత్తాల్లో లాభాలను అందిస్తాయి. జాయింట్ వ్యాపారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. హోదాతో కూడిన భాద్యతలు వరిస్తాయి. నిరుద్యోగులు మంచి ఆఫర్ లు అందుకుంటారు. విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. దానధర్మాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. అన్ని రకాల వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు .. సొంత ఇంటి ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం రాజీ మార్గంలో పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమ.. పెళ్లి వ్యవహాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మీన రాశి : ఈ రాశి వారికి ఈ వారం కొత్త వ్యాపారాలకు.. జాబ్ మారేందుకు మంచి అవకాశమని పండితులు చెబుతున్నారు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమమవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు... వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
