
- నిత్యావసర, అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్
- రూల్స్ ఉల్లంఘించిన వారిపై కేసులు
చెన్నై: తమిళనాడులో వన్‌డే లాక్‌డౌన్ సక్కెస్ అయ్యింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేయడానికి ఆదివారం తమిళనాడులో వన్‌డే లాక్‌డౌన్ అమలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ నిర్మాన్యుష్యంగా కనిపించాయి. నిత్యావసర సరుకులను రవాణా చేసే వాహనాలు, అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతించాయి. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్, వర్కర్స్, శానిటరీ, సివిక్ సిబ్బంది రోజులాగే వారి డ్యూటీలకు హాజరయ్యారు.
ఫ్లైట్స్, సబర్బన్, ఇతర రైళ్లు మినహా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులను రద్దు చేశారు. మెట్రో రైళ్లు కూడా నిలిచిపోయాయి. సబర్బన్ రైళ్లను 50 శాతం పరిమితితో నడిపారు. రెస్టారెంట్లలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టేకావే సర్వీసులు, ఫుడ్ డెలివరీలకు పర్మిషన్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రోడ్లను పోలీసులు మూసివేశారు. ఫ్లైఓవర్లు, హైవేలపై చెక్ పాయింట్‌లు పెట్టారు. లాక్‌డౌన్ రూల్స్‌ను ఉల్లఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వెహికల్స్‌ను సీజ్ చేశారు. స్థానిక, హెల్త్ ఆఫీసర్లు రాష్ట్రంలో పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలు చేశారు. తమిళనాడుకు ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దులను కూడా ఆదివారం క్లోజ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుంచి పొద్దుగాల 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది.