వార ఫలాలు .. 2024 ఫిబ్రవరి 18 నుంచి 24 వరకు

వార ఫలాలు ..  2024 ఫిబ్రవరి 18  నుంచి 24  వరకు

మేషం : నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో విభేదాల పరిష్కారం. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు.  బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. మీ ప్రతిభాపాటవాలకు గుర్తింపు. నిర్ణయాలపై తొందర పాటు వద్దు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారులకు క్రమేపీ లాభాలు. ఉద్యోగులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. రాజకీయవేత్తలకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. కళాకారులు, క్రీడాకారులు అనుకున్నది సాధిస్తారు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు.

వృషభం : కార్యజయం.  ఆలోచనలు అమలు. రహస్య విషయాలు తెలుసుకుంటారు. దేవాలయాల దర్శనం. కొన్ని ఊహలు నిజం చేసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహాది శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. వ్యాపారులకు అనుకున్న పెట్టుబడులు సమకూరతాయి.  ఉద్యోగులు అదనపు పనిభారం నుంచి బయటపడతారు. రాజకీయవేత్తల యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.  కళాకారులు, పరిశోధకులు కార్యసాధకులై ముందడుగు వేస్తారు.

మిధునం : అవసరాలకు తగిన సొమ్ము సమకూరుతుంది.  స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా. దూరప్రయాణాలు.  కష్టపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. దేవాలయాల సందర్శన. ముఖ్య వ్యవహారాల్లో చర్చలు ముందుకు సాగవు. కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. వ్యాపారులకు లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవేత్తలుచాకచక్యంగా వ్యవహరించాలి. కళాకారులు, క్రీడాకారులకు ఒత్తిడులు. వారారంభంలో శుభవార్తా శ్రవణం. ధనలబ్ధి. 

కర్కాటకం : చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు. వ్యాపారాల్లో క్రమేపీ పుంజుకుని లాభాలు అందుకుంటారు.  ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. క్రీడాకారులు,  కళాకారులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు.

సింహం : చేపట్టిన కార్యాలు అనుకున్న విధంగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.  పాత బాకీలు వసూలవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆపదలో ఉన్న వారికి స్నేహహస్తం ఇస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు, శ్రమ తగ్గే సమయం. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. క్రీడాకారులు, పరిశోధకులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.

కన్య : ఆదాయం సంతృప్తికరం. కొన్ని కార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆలోచనలకు కార్యరూపం. సమాజంలో విశేష గౌరవం. కుటుంబసభ్యుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో చర్చలు. దైవకార్యాల్లోలో పాల్గొంటారు. ఎంతోకాలంగా వేధిస్తున్న శారీరక రుగ్మతలు తీరతాయి.  వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు కోరుకున్న పోస్టులు. రాజకీయవేత్తలకు సంతోషకర సమాచారం. పరిశోధకులు, కళాకారులకు శుభవార్తలు.

తుల : సన్నిహితులతో వివాదాలు నేర్పుగా పరిష్కారం. ఆదాయమార్గాలు అనుకూలిస్తాయి. యత్నకార్యసిద్ధి. ఉద్యోగాన్వేషణలో నిరుద్యోగులు ముందడుగు వేస్తారు.  దేవాలయాల దర్శనం. వాహనాలు, భూముల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.  పెండింగ్​ కోర్టు కేసులు పరిష్కార దశకు చేరతాయి. వ్యాపారులకు ఊహించని  పెట్టుబడులు, లాభాలు.  ఉద్యోగులకు సానుకూలత. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు. కళాకారులు, క్రీడాకారులు లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం : సోదరుల ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. కొన్ని నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. గతంతో పోల్చుకుంటే ఆదాయం మెరుగుపడుతుంది. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగాల్లో చిక్కులు, సమస్యలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు నూతన ప్రాజెక్టుల ఏర్పాటులో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులు, పరిశోధకులు సత్తా చాటుకుంటారు.

ధనుస్సు : ముఖ్యకార్యాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితుల సహాయసహకారాలు స్వీకరిస్తారు. ఒక ప్రకటనపై  నిరుద్యోగులు సంతోషిస్తారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. స్థిరాస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కారం. దేవాలయాల సందర్శన. వ్యాపారులకు కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం. ఉద్యోగులకు అన్ని విధాలా అనుకూలమైనకాలం. కళాకారులుకు ఆశించిన అవకాశాలు. క్రీడాకారులు, పరిశోధకులకు ఉత్సాహంగా ఉంటుంది.

మకరం : ముఖ్య కార్యాలు అనుకున్న విధంగా పూర్తి. ఆదాయం ఆశాజనకం. సోదరులతో విభేదాల పరిష్కారం. ఆభరణాలు, వాహనాలు కొంటారు. మధ్యలో చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. దేవాలయాల సందర్శన. ఇంటి  నిర్మాణయత్నాలకు కార్యరూపం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవేత్తలకు కొత్త కంపెనీల ఏర్పాటులో సానుకూలం. కళాకారులు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు .

కుంభం : శ్రమానంతరం కొన్ని కార్యాలు పూర్తి. ఆదాయం కనిపిస్తున్నా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉండే సూచనలు. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత విముక్తి. సన్నిహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సోదరుల పిలుపుతో ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులు పెట్టుబడుల కోసం చేసే యత్నాలు సఫలం. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు. పారిశ్రామికవేత్తలకు కీలక సమాచారం.  రాజకీయవేత్తలు, పరిశోధకులకు నూతనోత్సాహం.

మీనం : అదనపు ఆదాయం సమకూరినా కొన్ని ఖర్చులు ఉంటాయి. వాహనాలు, భూములు కొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు పైపోస్టులు దక్కించుకునే అవకాశం. పారిశ్రామికవేత్తలకు కొంత సామాన్యంగా ఉంటుంది. కళాకారులు, పరిశోధకులు లక్ష్యాలు నెరవేరతాయి.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400