వార ఫలాలు డిసెంబర్ 10 నుంచి 16 వరకు

వార ఫలాలు డిసెంబర్ 10  నుంచి 16 వరకు

మేషం : కార్యక్రమాలు కొన్ని  ముందుకు సాగవు. మీ సలహాలను కుటుంబంలో వ్యతిరేకిస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందక నిరాశ చెందుతారు. ఆస్తి వివాదాలపై చొరవ తీసుకుంటారు. స్వల్ప శారీరక రుగ్మతలు. వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. క్రీడాకారులు, కళాకారులకు అవకాశాలు చేజారతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.

వృషభం : కొత్త కార్యక్రమాలు సమయానికి పూర్తి. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. ప్రముఖుల నుంచి ఉపయుక్తమైన సమాచారం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తిలాభ సూచనలు. వాహనసౌఖ్యం. ఇంటి నిర్మాణయత్నాల్లో అవాంతరాలు తొలగుతాయి. స్వల్ప శారీరక రుగ్మతలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఇబ్బందులు తొలగుతాయి. వారం మధ్యలో బంధు విరోధాలు. ప్రయాణాలు వాయిదా.

మిథునం : ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి. ఆలోచనలకు కార్యరూపం. శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. భూములు, ఇళ్లు కొంటారు. అనుకున్న రాబడి దక్కుతుంది. అందరిలోనూ ప్రత్యేక గౌరవం. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వ్యాపారులకు నూతనోత్సాహం, పెట్టుబడుల్లో అనుకూలత. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు  ప్రోత్సాహకరం. వారారంభంలో ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు.

కర్కాటకం : కొత్త కార్యక్రమాలు విజయవంతం. సమాజంలో  కీర్తిప్రతిష్టలు. విద్యార్థులు పట్టుదలతో కొత్త అవకాశాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుకుంటాయి. శారీరక రుగ్మతలు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. వారాంతంలో మానసిక అశాంతి. అనుకోని ప్రయాణాలు.

సింహం : కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు. ఊహించని విధంగా ఉద్యోగలాభం. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. భూ, గృహయోగాలు. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబసభ్యులతో సఖ్యత.  పరిస్థితులు అనుకూలిస్తాయి. పరిచయాలు విస్తృతం. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు కీలక సమాచారం. రాజకీయవేత్తలు, క్రీడాకారుల కృషి ఫలిస్తుంది. వారాంతంలో వ్యయప్రయాసలు. ఆత్మీయులతో విభేదిస్తారు. ప్రయాణాలు వాయిదా.

కన్య : కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆప్తుల సలహాలతో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఇళ్లు కొంటారు. కోర్టు వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. అరుదైన ఆహ్వానాలు. వ్యాపారుల ఊహలకు తగినట్లుగా లాభాలు. ఉద్యోగులకు అదనపు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారారంభంలో ఖర్చులు. బంధువిరోధాలు. స్వల్ప రుగ్మతలు.

తుల : కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు కీలకసమాచారం. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. బంధువర్గం నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాలు తుది దశకు చేరతాయి. భూ, గృహ యోగ సూచనలు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అనుకూలం. వారాం తంలో స్నేహితుల నుంచి ఒత్తిళ్లు. శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు.

వృశ్చికం : ఆప్తుల నుంచి అందిన సమాచారంతో ఉత్సాహాన్నిస్తుంది. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూ వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు అనుకూలం. వారం మధ్యలో శారీరక రుగ్మతలు. స్నేహితులతో తగాదాలు.

ధనుస్సు : కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. కాంట్రాక్టులు ఎట్టకేలకు పొందుతారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం. వ్యాపారులు ఊహించని విధంగా లాభపడతారు. ఉద్యోగులకు సంతోషదాయకమైన కాలం. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ఊహించని అవకాశాలు. వారారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు.

మకరం : ముఖ్య కార్యాలలో విజయం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. భూములు, వాహనాలు కొనే వీలుంది. ఆత్మీయుల సహకారం అందుతుంది. రాబడి సంతృప్తినిస్తుంది. శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు సంతోషదాయకంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలం. వారారంభంలో దుబారా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు.

కుంభం : ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలకు కార్యరూపం. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తుల పరిచయం. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు అధిగమిస్తారు. శుభకార్యాల గురించి కుటుంబంలో సంప్రదింపులు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహవంతం. వారాంతంలో అనుకోని ఖర్చులు. స్నేహితులతో వివాదాలు.

మీనం : కొత్త విషయాలు తెలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి. వాహనసౌఖ్యం. కుటుంబంలో శుభకార్యాలు. సోదరులతో వివాదాలు తీరతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారులకు ఉత్సాహవంతం. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పరిశోధకులు, పారిశ్రామికవేత్తలకు అనుకూలత.  వారాంతంలో దూరప్రయాణాలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400