
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( జూన్ 1 నుంచి 7 వ తేది వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం.
మేషరాశి: ఈ వారం ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది.అన్ని విషయాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. వ్యాపారం.. ఉద్యోగ విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. వారం మధ్యలో ఓ శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగిస్తారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
వృషభరాశి: ఈ రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. వారం మధ్యలో పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఖర్చులను నియంత్రించుకోండి.. అంతా మంచే జరుగుతుంది.
మిథున రాశి: ఈ రాశి వారు ప్రభుత్వ ఉద్యోగులతో జరిపే సంప్రదింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. జీవిత భాగస్వామి సలహా.. సంప్రదింపులను పాటించండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగడంతో పాటు... కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. వృత్తి పరంగా ఎలాంటిఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతా బాగానే ఉంటుంది. ఎలాంటి ఆందళన చెందాల్సిన అవసరం లేదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారం శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. - కొంచెం ఎక్కువ ఖర్చు జరుగుతోంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. గతంలో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా.. సంతృప్తిగానే ఉంటుంది. ఆఫీసులో మీరే చక్రం తిప్పుతారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
సింహ రాశి: ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరగడంతో కొంత ఆందోళన ఉంటుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
కన్య రాశి: ఈ రాశి వారు ఈ వారం అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య అవగాహనలోపంతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది. కంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదో తెలియని విషయం మనసును కలవరపెడుతుంది. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి. ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. వ్యాపారస్తులకు ఈ వారం కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. అంతా మంచే జరుగుతుంది.
తుల రాశి: ఈ రాశి వారు ఈ వారం చాలా ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. కుటుంబసభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గతంలో మిమ్మలను విబేధించిన వారు ఈ వారం చివరిలో మీ దగ్గరకు వస్తారు. రాజకీయ నాయకులు ఈ వారం గుడ్న్యూస్ వినే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. వారం చివరిలో కొంత ఆందోళనతో గడపాల్సిన పరిస్థితులు వస్తాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారం ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనుకున్న ప్రదేశానికి - బదిలీ అవుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. గతంలో చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంటుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఈ వారం సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈ వారం ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగుల పరిస్థితి బాగుటుంది. ఆఫీసులో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. వ్యాపార విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవిత భాగస్వామి పూర్తి సహకారం లభిస్తుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.
మకర రాశి: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు అధికంగా లాభాలుంటాయి. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ప్రయాణ విషయాల్లో అప్రమత్తంగా ఉండండి.
కుంభ రాశి: ఈ రాశి ఈ వారం అనవసర ప్రయాణాలు వెంటాడుతాయి. గతంలో ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. ఆఫీసులో తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధం లేకుండా కొన్ని అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు లేకపోయినా నష్టం ఉండదు. ఇంట్లో పెద్దల ఆరోగ్యవిషయంలో కేర్ తీసుకోవాలి. ఏ విషయంలో కూడా తొందరపరడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.
మీన రాశి: ఈ రాశి వారికి గతంలో కంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. సినీ రంగంలో ఉన్నవారికి మంచి సానుకూల ఫలితాలుంటాయి. కొన్ని విషయాల్లో.. చికాకు.. అసహనం ఏర్పడుతుంది. అయినా వారం చిరవరిలో మీరే విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు వారం ప్రారంభంలో కొద్దిపాటి ఇబ్బందులు కలిగినా.. చివరకు అంతా మంచే జరుగుతుంది. వ్యాపారస్తులు క్రమేణ పుంజుకుంటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.