వారఫలాలు: అక్టోబర్ 12 నుంచి 18 వరకు.. 12 రాశుల వారి ఫలితాలు ఇవే..

వారఫలాలు:   అక్టోబర్ 12  నుంచి 18  వరకు..  12 రాశుల వారి ఫలితాలు ఇవే..

వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( అక్టోబర్12  నుంచి   18  వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం.

మేష రాశి :  ఈ రాశి వారు ఈ వారం చాలా బిజీగా గడుపుతారు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.  ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఆఫీసులో సెంటర్​ ఆఫ్​ ఎట్రాక్షన్​ గా నిలుస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  ఇక ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనసాగిపోతాయి. బిజినెస్​ చేసే వారు లాభాల బాటను కొనసాగిస్తారు.  జీవిత భాగస్వామి ఆలోచనలు తీసుకుంటే మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసివస్తాయి.

వృషభ రాశి : ఈ రాశి వారికి కుటుంబసభ్యుల మధ్య బంధం బలపడుతుంది.   భూ వివాదాలు పరిష్కారమవుతాయి.   కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. గతంలో వివిధ కారణాల వలన నిలిచి పోయిన పనులు పూర్తవుతాయి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలను వాయిదా వేసుకోండి. 

 మిథున రాశి : ఈ రాశి వారికి ఈ వారం అనుకోని ఖర్చులు ఆందోళన కలిస్తాయి.  ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.  అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.  నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు రాకపోయినా నష్టం ఉండదు. పెద్దల సూచనలను పాటించండి. పిల్లల విషయంలో  కొన్ని జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

కర్కాటక రాశి : ఈ వారం, ఈ రాశి వారికి కష్టకాలం ఉంటుంది. అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఆలలస్యంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం వలన లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అయ్యే అవకాశం ఉంది.  కావున ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి.

సింహ రాశి  : ఈ రాశి వారికి ఈ వారం కుటుంబంలో ఒక చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. కష్టం మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. సన్నిహితులతో అకారణంగా తగాదాలు వచ్చే అవకాశం ఉంది.  ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు ఏర్పడుతాయి. . విద్యార్థులకు అవకాశాలు  చేజారవచ్చు. కుటుంబ బాధ్యతలపై అధిక దృష్టి సారిస్తారు.   వ్యాపారులకు ఆశించిన లాభాలు కష్టంగా మారుతుంది. ఉద్యోగులకు అదనపు పనిభారం పెరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

కన్య రాశి జాతకం:  ఈ రాశి వారికి  చాలా అనుకూలంగా ఉంటుంది.  ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరే అవకాశం ఉంది.  గతంలో ఆగిపోయిన పనుల్లో ఈ వారంలో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తులు ప్రమోషన్​ పొందేందుకు రూట్​ క్లియర్​ అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఈ వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది.  ప్రేమ... పెళ్లి వ్యవహారాలు అనుకూలంగాసాగిపోతాయి. 

తుల రాశి: జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వారం ఈ రాశి వారు ప్రతి విషయాన్ని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. కొత్త పనులు చేపట్టేందుకు ఇది అనుకూల సమయం.  ఉద్యోగస్తులు.. సంస్థ మారకుండా ఉంటేనే మంచిదని పండితులు సూచిస్తున్నారు.  అనుకున్న పనిని సాధిస్తారు.  వ్యాపారస్తులు అనుకున్న లాభాలు పొందుతారు.  ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.   ఆర్థిక విషయంలో పురోగతి ఉంటుంది. ఐటీ సెక్టార్​ లో పనిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.  ఉద్యోగస్తులకు.. సహోద్యోగుల ప్రోత్సాహం ఉంటుంది. 

వృశ్చిక రాశి :  ఈ రాశి వారికి ఈ వారం  అంతా మంచే జరుగుతుంది.  అయితే.. ఆవేశాన్ని.. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  వారం చివరిలో ఆర్థికంగా పురోభివృద్దితో పాటు సమాజంలో గౌరవం.. కీర్తి .. ప్రతిష్ఠలు లభిస్తాయి.  వృత్తి.. ఉద్యోగస్తులు మీరు చేస్తున్న పనిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలు గడించే అవకాశం ఉంది.  పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
ధనుస్సు రాశి :  ఈ వారం ఈ రాశి వారు  పెద్దల సూచనలు... సలహాలు పాటించాలి.  ప్రతి విషయాన్ని  కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  స్త్రీ వలన అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.  అనుకోకుండా ప్రయాణాలు రావడంతో ఖర్చు అధికమవుతుంది.   అనుకున్న పనులు నెరవేరడంతో సంతోషిస్తారు.  వ్యాపారస్తులకు లాభాలు పెద్దగా రాకపోయినా... నష్టాలు మాత్రం  ఉండవని పండితులు సూచిస్తున్నారు.  ప్రతి పనిలో ఓర్పు .. సహనం అవసరం. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి

మకర రాశి: ఈ రాశి వారు ఈ వారం పనిభారంతో ఇబ్బంది పడతారు. ఇతరుల సహాయం లభించదు.  కష్టపడి పనిచేయడం తో విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా బలపడేందుకు మంచి సమయం. ఉద్యోగస్తులు అధిక సమయం పని చేయాల్సిన పరిస్థితులతో  పాటు.. మంచి గుర్తింపు వచ్చే వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మంచి నిర్ణయాలు తీసుకోవడంతో చాలా ఊరట లభిస్తుంది.  వృత్తి.. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  ప్రభుత్వ ఉద్యోగులకు శ్రమ అధికమవుతుంది.   ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. 

కుంభం: ఈ రాశి ఈ వారం ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.  చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.  ఓర్పు ... సహనంతో ఉండండి.. ఎలాంటి వాదోపవాదనలకు పెట్టుకోవద్దు.  ఆఫీసులో మీ పని మీరు చేసుకోండి.. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు..దైవ చింతనతో గడపండి.. ఎలాంటి ఒడిదుడుకులకు.. ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. 

మీన రాశి : ఈరాశి వారికి ఈ వారం కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. వారం ప్రారంభంలో  గొడవలు ఏర్పడే అవకాశం ఉంది.  ఎలాంటి విషయాల్లో అవసరానికి మించి మాట్లాడవద్దు. ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతాయి.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.  నిరుత్సాహం పడకుండా మీ పని మీరు చేసుకోండి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ సమాచారం  జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.