వారఫలాలు ( సౌరమానం) జూన్ 23 నుంచి 29 వరకు

వారఫలాలు ( సౌరమానం) జూన్ 23 నుంచి 29 వరకు

మేషం : ఆదాయం గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. స్నేహితులు, బంధువులతో విభేదాలు తీరతాయి. ఆలోచనలకు కార్యరూపం. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. ఆస్తి విషయంలో నిలిచిపోయిన  అగ్రిమెంట్లు పూర్తి. ప్రముఖల నుంచి ఆహ్వానాలు. వ్యాపార విస్తరణ యత్నాలు సఫలం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలకు దీర్ఘకాలిక సమస్య ఒకటి తీరుతుంది.

వృషభం : కొత్త వ్యక్తుల పరిచయం. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. సోదరులు,స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో శ్రమ. రాబడి పెరుగుతుంది. వాహనాలు, గృహం కొంటారు. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారాంతంలో ప్రయాణాలు.

మిధునం : అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది. సన్నిహితులు,స్నేహితులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ముఖ్యకార్యక్రమాలు సకాలంలో పూర్తి. అరుదైన ఆహ్వానాలు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ఊహించని రీతిలో ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు.

కర్కాటకం : చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు ఊహించని రీతిలో లాభాలు. ఉద్యోగులకు ఆశించిన మార్పులు. పారిశ్రామికవేత్తలకు శుభవర్తమానాలు. వారాంతంలో దూరప్రయాణాలు.

సింహం : కొంత జాప్యం జరిగినా అనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు. స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. అనుకున్న డబ్బు సకాలంలో సమకూరుతుంది. వాహనసౌఖ్యం. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. చేజారిన కొన్ని డాక్యుమెంట్లు తిరిగి దక్కుతాయి. వ్యాపారులకు మరిన్ని లాభాలు. ఉద్యోగులకు సంతోషకర సమాచారం అందుతుంది. కళాకారులకు అప్రయత్న అవకాశాలు. వారారంభంలో దూరప్రయాణాలు.

కన్య : ముఖ్యమైన కార్యక్రమాల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు. పాత సంఘటనలు గుర్తుకొస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారులు లాభాలతో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు కొత్త విధుల్లో చేరతారు. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు. వారారంభంలో  అనుకోని ఖర్చులు.

తుల : నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆశించిన ఆదాయం. నిరుద్యోగులకు అనుకున్న అవకాశాలు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. ప్రముఖ వ్యక్తులు మీకు కొంత సాయపడతారు. కుటుంబసభ్యుల ఆశలు నెరవేరుస్తారు. వ్యాపారులు మరింతగా లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూలం. రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారాంతంలో వృథా ఖర్చులు.

వృశ్చికం : ఆదాయం సమృద్ధిగా ఉండి ఎంతటి ఖర్చు ఎదురైనా అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులకు శుభవర్తమానాలు. తరచూ ప్రయాణాలు. కొన్ని నిర్ణయాలను కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. వాహనయోగం. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.  వారం మధ్యలో పని ఒత్తిడులు. 

ధనస్సు : నూతన విద్యాయత్నాలు కలిసివస్తాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసి ఒడ్డునపడతారు. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆదాయ, వ్యయాలు సమానం. వాహనసౌఖ్యం. శుభకార్యాల నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం. వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమిస్తారు.

మకరం : రాబడి కొంత తగ్గినా అవసరాలకు డబ్బు సమకూరుతుంది. కొత్త కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆప్తులతో మనసులోని భావాలు పంచుకుంటారు. విలువైన వస్తువులు కొంటారు. కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.  వ్యాపార విస్తరణ యత్నాలు కలసివస్తాయి.  ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయవేత్తల యత్నాలు కలసివస్తాయి.

కుంభం : రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం. కొన్ని కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉపశమనం లభిస్తుంది. రాజకీయవర్గాలకు కొత్త ఊహించని పదవీయోగం. వారం మధ్యలో   దూరప్రయాణాలు.

మీనం : ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. పరిస్థితులు అంతగా అనుకూలించవు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బందిగా మారవచ్చు. వ్యాపారులకు గందరగోళ పరిస్థితి. ఉద్యోగులకు అదనపు పనిభారం.  పారిశ్రామికవేత్తలకు నిరాశ. వారం మధ్యలో  శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400