వార ఫలాలు ( సౌరమానం) 12.11.2023 నుంచి 18.11.2023 వరుకు

వార ఫలాలు (  సౌరమానం) 12.11.2023 నుంచి 18.11.2023 వరుకు

మేషం : అనుకున్న కార్యాలు నిదానిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొన్ని ఒప్పందాలు  వాయిదాపడతాయి. మీ వ్యూహాలు కొన్ని తప్పే సూచనలు. ఆదాయం తగ్గినా అవసరాలకు ఇబ్బందులు ఉండవు. బంధువులతో విభేదిస్తారు. కొన్ని బాధ్యతలు పెరిగి సతమతమవుతారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపారులు  విస్తరణ కార్యక్రమాలను నిలిపివేస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. కళాకారులు, క్రీడాకారులకు గందరగోళ పరిస్థితి  వారారంభంలో బంధువుల కలయిక. ధన, వస్తులాభాలు.

వృషభం : ఉత్సాహంగా కొన్ని కార్యాలు పూర్తి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సొమ్ముకు లోటు ఉండదు.  దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వ్యాపారులకు పెట్టుబడులు. ఉద్యోగులకు అనుకోని హోదాలు రావచ్చు. కళాకారులు, క్రీడాకారులు లక్ష్యాలు సాధిస్తారు. 

మిధునం : దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్న కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు పూర్తి కాగలవు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొన్ని సమస్యలు ఎదురైనా సర్దుబాటు కాగలవు.

కర్కాటకం : ముఖ్యమైన కార్యాలు కొంత నిదానించినా చివరికి పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇంటి నిర్మా ణయత్నాలు సానుకూలం. ఆదాయానికి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. కుటుంబసభ్యుల ఆదరణ పొందుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైన మార్పులు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి.

సింహం : పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా  పూర్తి . ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వేడుకలు నిర్వహిస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. కొత్త విద్యావకాశాలు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. రాబడి సంతృప్తికరం. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారులకు కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరం.

కన్య : బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. రావలసిన డబ్బులు అందుతాయి. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. వ్యాపారులకు అనుకోని పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. 

తుల : పలుకుబడి మరింత పెరుగుతుంది. అనుకోని విధంగా ఆదాయం సమకూరుతుంది. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. యుక్తితో ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. భూ, వాహనయోగాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారులకు  లాభాలు. భాగస్వాములతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు సంభవం. రాజకీయవేత్తలు, క్రీడాకారులు విజయాలు సాధిస్తారు.

వృశ్చికం : అనుకున్న కార్యక్రమాలు నిదానిస్తాయి. అదనపు ఆదాయం సమకూర్చుకున్నా కొత్తగా అప్పులు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. కుటుంబ పెద్దల సలహాలు స్వీకరిస్తారు. మిమ్మల్ని బంధువులు మరింత ఇష్టపడతారు. వేడుకలు నిర్వహిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితి. కళాకారులు, క్రీడాకారులకు కొత్త ఆశలు.

ధనుస్సు : సన్నిహితులతో  ఆనందంగా గడుపుతారు. పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఒక సంఘటన విశేషంగా  ఆకట్టుకుంటుంది. భూ వివాదాలు తీరే సమయం. పట్టుదలతో కొన్ని సమస్యలు అధిగమిస్తారు. రాబడి ఆశాజనకం. సోదరులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వివాహాది వేడుకలు సైతం నిర్వహిస్తారు. వ్యాపారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలమవుతాయి.

మకరం : అనుకున్న కార్యాలు సజావుగా పూర్తి. ఆత్మీయుల ఆదరాభిమానాలు పొందుతారు. ఆస్తి విషయంలో  ఒప్పందాలు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు.  ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆశించిన సొమ్ము సమయానికి సమకూరుతుంది. తండ్రి తరఫు నుంచి సహాయసహకారాలు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులు, క్రీడాకారులు సత్తా చాటుకుంటారు. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి.

కుంభం : చేపట్టిన కార్యక్రమాలలో విజయం. సమాజంలో  కీర్తి ప్రతిష్ఠలు. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాహయత్నాలు సానుకూలం. కొంత సొమ్ము అనుకోకుండా దక్కుతుంది. స్థిరాస్తి విక్రయాలు పూర్తి చేస్తారు. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారుల క్లిష్టసమస్యలు తీరతాయి. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. కళాకారులు, పరిశోధకులకు ఉత్సాహవంతమైన కాలం.

మీనం : అనుకున్నది సాధించాలన్న తపనతో ముందుకు సాగుతారు. కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.  ప్రత్యర్థులను సైతం మీదారికి తెచ్చుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో  వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విశేష గుర్తింపు. రాజకీయవర్గాలు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400